సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురవడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో (Mohan Babu Admitted in Hospital) చేర్పించారు. కుటుంబ విభేదాలు, ముఖ్యంగా ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌తో ఏర్పడిన గొడవల నేపథ్యంలో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ గొడవల్లో మోహన్ బాబు బీపీ పెరగడంతో కిందపడ్డారు. దీంతో వెంటనే ఆయన్ను హాస్పటల్ కు తరలించారు.
అంతమందు మనోజ్ తో గొడవ జరుగుతున్న సమయంలో మోహన్ బాబు సహనం కోల్పోయి మీడియా ప్రతినిధులపై దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. ఇంటి వద్దకు వచ్చిన మీడియాపై మోహన్ బాబు మైక్ లాగి దాడి చేశారు. దీనివల్ల ఒక మీడియా ప్రతినిధి గాయపడ్డారు. ఈ సంఘటన మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఘటనపై స్పందించి మోహన్ బాబు, మంచు విష్ణు గన్ లైసెన్స్‌లను సీజ్ చేయాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి అందిన లైసెన్స్‌లను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. మరోపక్క ఈ ఘటన నేపథ్యంలో మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం.. మోహన్ బాబు రేపు ఉదయం 10.30 గంటలకు రాచకొండ సీపీ కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంది. ప్రస్తుతం మోహన్ బాబు హాస్పటల్ లో ఉన్నారు.
Read Also : Indian Coast Guard : 78 మంది మత్స్యకారులతో రెండు బంగ్లాదేశ్ నౌకల్ని సీజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్