Ram Charan- Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Ram Charan- Sukumar) కాంబినేషన్‌లో రాబోతున్న తదుపరి ప్రాజెక్ట్ RC17 గురించి సినీ అభిమానులలో ఉత్సాహం రెట్టింపైంది. వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం (2018) తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్‌గా పేరు పొందిన నేపథ్యంలో ఈ కొత్త సినిమా కథాంశంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న గ్రామీణ క్రీడా యాక్షన్ డ్రామా పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 27, 2026న విడుదల కానున్న తర్వాతే చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత కీలక ప్రకటన
తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్స్ సందర్భంగా పాల్గొన్న మైత్రీ నిర్మాత రవి శంకర్ RC17 కథా నేపథ్యంపై ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అందించారు. ఈ చిత్రం ఆధునిక కాలం నేపథ్యంలో తెరకెక్కనుందని ఆయన ధృవీకరించారు. గతంలో రంగస్థలం 1980ల నాటి పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కి ఘన విజయం సాధించింది. అందులో చరణ్ చిట్టిబాబు పాత్రలో డి-గ్లామర్ లుక్‌లో కనిపించారు. అయితే ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో వచ్చిన ఊహాగానాలు ఇప్పుడు నిజమవుతున్నట్లుగా.. సుకుమార్ ఈసారి చరణ్‌ను పూర్తి భిన్నంగా, స్టైలిష్‌గా, పట్టణ లుక్‌లో చూపించబోతున్నారని నిర్మాత వ్యాఖ్యలు పరోక్షంగా సూచించాయి.
Also Read: Commonwealth Games: అహ్మదాబాద్‌లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!
RC17 కథాంశంపై మరింత స్పష్టత రావడంతో సినిమా జానర్ (యాక్షన్, థ్రిల్లర్, లేదా రొమాంటిక్) ఏమిటనేది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ ఎప్పుడూ ఊహించని కథాంశాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. కాబట్టి ఈ మెగా-ప్రాజెక్ట్‌తో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.
