Site icon HashtagU Telugu

Ram Charan : చరణ్ కుక్కపిల్లతో ఆడుకుంటున్న ఇంటర్నేషనల్ బాక్సర్.. RC16 కోసం ట్రైనింగ్..!

Mma Professional Fighter Kevin Kunta, Ram Charan, Rhyme, Rc16

Mma Professional Fighter Kevin Kunta, Ram Charan, Rhyme, Rc16

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా RC16 షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఫ్యామిలీతో కలిసి ఒక వెకేషన్ ట్రిప్ ని ప్లాన్ చేసారు. ఈక్రమంలోనే ఉపాసన, కూతురు క్లీంకార, పెట్ డాగ్ రైమ్ తో కలిసి చరణ్ లండన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ ట్రిప్ కి సంబంధించిన విషయాలను రైమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి షేర్ చేస్తున్నారు.

ఈక్రమంలోనే రీసెంట్ గా ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసారు. ఆ స్టోరీలో రైమ్ తో కలిసి ఒక ఇంటర్నేషనల్ బాక్సర్ ఆడుకుంటూ కనిపించాడు. MMA ప్రొఫిషినల్ ఫైటర్ అయిన కెవిన్ కుంట.. రైమ్ తో పార్క్ లో ఆడుకుంటూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోని కెవిన్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసారు. ఇక ఆ స్టోరీని రైమ్ అకౌంట్ నుంచి మళ్ళీ రీ షేర్ చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే ఇక్కడ ఒక విషయం చరణ్ అభిమానులను ఆలోచించేలా చేస్తుంది. MMA ప్రొఫిషినల్ ఫైటర్, చరణ్ ఫ్యామిలీతో ఎందుకు ఉన్నాడు..? ఆ బాక్సర్ దగ్గర రామ్ చరణ్ ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటున్నారా..? అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే, RC16 సినిమాలో చరణ్ ఒక బాక్సర్ గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో బాక్సర్ కి తగ్గట్లు బాడీ మేక్ ఓవర్ చేయడానికి చరణ్ ఫారిన్ వెళ్లనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రొఫిషినల్ ఫైటర్, చరణ్ తో కనిపించడంతో.. ఏమైనా ట్రైనింగ్ క్లాస్ లు జరుగుతున్నాయా..? అనే సందేహం కలుగుతుంది.