Site icon HashtagU Telugu

MLC Kavitha : రష్మిక ఫేక్ వీడియోపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. చర్యలు తీసుకోవాలంటూ..

Mlc Kavitha Reacts on Rashmika Mandanna Fake Video

Mlc Kavitha Reacts on Rashmika Mandanna Fake Video

గత రెండు రోజులుగా రష్మిక మందన్న(Rashmika Mandanna) లిఫ్ట్ లో ఉన్న డీప్ నెక్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయింది. జరా పటేల్ అనే అమ్మాయి వీడియోని AI తో పేస్ మార్ఫింగ్ చేసి రష్మిక విదేవులా మార్చారు. దీంతో ఇది వైరల్ అవ్వడంతో రష్మిక ఏంటి ఇలాంటి వీడియో పోస్ట్ చేసింది అని అంతా అనుకున్నారు.

దీంతో ఈ ఫేక్ వీడియోపై రష్మిక అభిమానులు, నెటిజన్లు విమర్శలు చేస్తూ చర్యలు తీసుకోవాలంటూ కోరారు. అమితాబ్ తో సహా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా స్పందించారు. రష్మిక కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించి ఇలాంటివి చేసేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరింది. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా రష్మిక ఫేక్ వీడియోపై స్పందించింది.

కవిత(MLC Kavitha) తన ట్విట్టర్ లో రష్మిక వీడియోపై స్పందిస్తూ.. ఇటీవల వైరల్ అయిన రష్మిక ఫేక్ వీడియోతో ఇలాంటి ఫేక్ వీడియోలు ఎంత సులభంగా చేస్తున్నారో తెలుస్తుంది. ఇలాంటి సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలి. తగిన చర్యల రూపకల్పన కోసం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. రక్షణా చర్యలను సమగ్రంగా రూపొందించడం కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ట్విట్టర్ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు.

 

Also Read : Rashmika Mandanna : ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక.. ఇదే కాలేజ్ డేస్ లో జరిగుంటే..!