Site icon HashtagU Telugu

Jailer : ‘జైలర్’ చిత్రాన్ని వీక్షించిన సీఎం స్టాలిన్

Mk Stalin Watched Jailer Mo

Mk Stalin Watched Jailer Mo

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ (Jailer movie) చిత్రాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ (CM MK Stalin ) వీక్షించారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలను పోషించిన ఈ మూవీ ఆగస్టు 10 న తెలుగు , తమిళ్ భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన అభిమానులు , సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా..తాజాగా సీఎం స్టాలిన్ ఈ చిత్రాన్ని వీక్షించి చిత్ర యూనిట్ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson) ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… సినిమాను వీక్షించిన స్టాలిన్ సార్ కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మీ ప్రశంసలు తమలో స్ఫూర్తిని నింపాయని చెప్పారు. మీరు సినిమాను చూడటం వల్ల చిత్ర బృందం మొత్తం ఆనందంగా ఉందని తెలిపింది. మరోవైపు ఈ చిత్రంలో రజినీకాంత్ రిటైర్డ్ పోలీసు అధికారి పాత్రను పోషించారు. ఈ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

Read Also : Harish Rao: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే: మంత్రి హరీశ్ రావు