Mithun Chakraborty : మిథున్ చక్రవర్తికి అస్వస్థత.. ఛాతీనొప్పితో ఆస్పత్రిలో చేరిక

Mithun Chakraborty : ప్రముఖ బాలీవుడ్ నటుడు 73 ఏళ్ల మిథున్ చక్రవర్తి తీవ్రమైన ఛాతీ నొప్పితో శనివారం ఉదయం కోల్‌కతాలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

  • Written By:
  • Updated On - February 10, 2024 / 02:36 PM IST

Mithun Chakraborty : ప్రముఖ బాలీవుడ్ నటుడు 73 ఏళ్ల మిథున్ చక్రవర్తి తీవ్రమైన ఛాతీ నొప్పితో శనివారం ఉదయం కోల్‌కతాలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈవిషయాన్ని ఆయనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మిథున్ ఆస్పత్రిలో చేరగానే ఎంఆర్‌ఐ చేశామని, ప్రస్తుతం ఇతర వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపాయి. ‘‘మిథున్‌ను ఇవాళ ఉదయం 10.30 గంటలకు  ఆస్పత్రికి తీసుకొచ్చారు. MRI  రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం  ITUలో న్యూరోమెడిసిన్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ఉన్నారు’’ అని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.  మిథున్ చక్రవర్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీలో నాయకుడిగా ఉన్నారు.  ఆయన 2021 సంవత్సరంలో  కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమక్షంలో బీజేపీలో చేరారు. అయినా కొన్ని సినిమాల్లో ఆయన నటిస్తున్నారు.గత 15 రోజులుగా మిథున్ కోల్‌కతాలో బెంగాలీ చిత్రం “శాస్త్రి” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మిథున్ చక్రవర్తి ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొని.. ఇంటికి తిరిగొచ్చాక అస్వస్థతకు గురయ్యారు. ఛాతీనొప్పిగా అనిపిస్తోందని కుటుంబీకులకు తెలిపారు. దీంతో వారు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు.

We’re now on WhatsApp. Click to Join

మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty) ఇటీవల ‘2024 పద్మభూషణ్ అవార్డు’కు ఎంపికయ్యారు.  మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన మూవీ ‘మృగయా’తో  మిథున్ చక్రవర్తి మూవీ కెరీర్ 1977లో మొదలైంది. ఈ సినిమాలో ఆయన అద్భుత నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది. ఆయన హిందీ, తమిళం, బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి, తెలుగు, కన్నడ, పంజాబీతో సహా అనేక చిత్రాలలో పనిచేశారు.

Also Read : 5000 Cases : హల్ద్వానీ హింసాకాండ.. 5000 మందిపై కేసులు.. ఐదుగురి అరెస్ట్

డిస్కో డాన్సర్, అగ్నిపథ్, ఘర్ ఏక్ మందిర్, జల్లాద్, ప్యార్ ఝుక్తా నహిన్ వంటి పలు ఫేమస్ మూవీల్లో మిథున్ హీరోగా నటించారు. బబ్బర్ సుభాష్ దర్శకత్వం వహించిన డిస్కో డాన్సర్ 1982లో విడుదలైంది.  మిథున్ తఖ్‌దీర్, లాల్ చునారియా, వో జో హసీనా, పసంద్ అప్నీ అప్నీ, యాదోన్ కి కసమ్, గులామి, ప్యారీ బెహనా, బేపన్నా, మా కసం, బేపన్నా, మా కసం, కరిష్మా కుద్రత్ కా, ప్యార్ కే దో పాల్, వంటి ప్రముఖ చిత్రాలలో నటించారు. గోల్మాల్ 3, FALTU, హౌస్‌ఫుల్ 2, OMG – ఓహ్ మై గాడ్!, ఖిలాడీ 786, రాకీ, కిక్, ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్, ది విలన్. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో రిటైర్డ్ ఐఏఎస్ పాత్రను పోషించినందుకు ఉత్తమ సహాయ నటుడిగా ఆయనకు ‘ఫిల్మ్‌ఫేర్ అవార్డు’ కూడా లభించింది. అతను డ్యాన్స్ బంగ్లా డాన్స్, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, దాదాగిరి అన్‌లిమిటెడ్, బిగ్ బాస్ బంగ్లా, ది డ్రామా కంపెనీ, డ్యాన్స్ ప్లస్, హునార్బాజ్: దేశ్ కి షాన్ వంటి టెలివిజన్ షోలలో పనిచేశారు.