Site icon HashtagU Telugu

Movie Making : పురాణ చిత్రాల్లో రైలు, తారు రోడ్లూ, ఎలక్ట్రిక్‌ స్థంభాలు గమనించారా.. ఆ సినిమాలు ఏంటో తెలుసా?

Mistakes in Movie making find in theaters lot of old movies have mistakes

Mistakes in Movie making find in theaters lot of old movies have mistakes

ఒక సినిమా(Movie)ని తెరకెక్కించడం అంటే మాములు విషయం కాదు. ఎన్ని టెక్నాలజీ(Technology)లు వచ్చినప్పటికీ మేకర్స్ పొరపాటు వల్ల ఎక్కడో ఒక చిన్న తప్పు అనేది జరుగుతుంది. ఆ తప్పులు ఎడిటింగ్(Editing) రూమ్ కి వస్తే గాని తెలియదు. అయితే ఆ ఎడిటింగ్ రూమ్ ని దాటుకొని కొన్ని తప్పులు వెండితెర పైకి వచ్చేస్తాయి. అలాంటి చిత్రాలు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలానే ఉన్నాయి. 1959లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన హాలీవుడ్ మూవీ ‘బెన్‌హార్‌’ (Ben-Hur). ఈ సినిమా సాంకేతిక లేని కథతో తెరకెక్కింది.

కానీ ఈ సినిమాలోని గుర్రాల రేస్‌ సీన్ ని చిత్రీకరిస్తుండగా.. ఆ ఫ్రేమ్ లో చూసుకోకుండా ఒక కారు కూడా బందీ అయ్యిపోయింది. అలాగే మరో హాలీవుడ్ సినిమా ‘ట్రాయ్‌’లో రాజుల కాలం యుద్ధ సన్నివేశం జరుగుతున్న సమయంలో ఆకాశంలో విమానం వెళ్లడం కనిపిస్తుంది. చిత్రీకరణ సమయంలో మేకర్స్ ఆ విషయాన్ని గమనించలేదు. ఇలాంటి తప్పుడు తెలుగు సినిమాలో కూడా చాలానే జరిగాయి. టాలీవుడ్ లో ఎన్నో పురాణ చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని సినిమాల్లో తారు రోడ్లు మరియు ఎలక్ట్రిక్‌ స్థంభాలు కనిపిస్తాయి.

‘సంపూర్ణ రామాయణం’ సినిమాలోని ఒక సీన్ లో అయితే వెనుక ఏకంగా రైలు కనిపిస్తుంది. ‘వినాయక చవితి’ ఛితంలో ప్రసేనుడు గుర్రం మీద వెళ్తున్న సమయంలో రోడ్డు సైడ్ ఉన్న టెలిగ్రాఫ్‌ తీగలు కనిపిస్తాయి. కాగితం పుట్టని రోజుల కథతో వచ్చిన ‘పాండురంగ మహత్మ్యం’లో సంతకం పెట్టమని తెల్లకాగితం అందించడం కనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో సినిమాలు ఉన్నాయి. అంతెందుకు ఎంతో జాగ్రత్తగా సినిమాని చెక్కే జక్కన రాజమౌళి చిత్రాల్లోనే మనవాళ్ళు ఎన్నో తప్పులు కనిపెడుతుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో ఆ తప్పులు మరింత ఫాస్ట్ గా తెలిసిపోతున్నాయి. ఇక వాటి పై మీమ్స్ చేసి షేర్ చేస్తూ నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తుంటారు.

 

Also Read : SPY Trailer : నిఖిల్ ‘స్పై’ టీజర్ అదిరిందిగా.. రానా గెస్ట్ అప్పీరెన్స్..