అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) జంటగా నటించిన మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty). యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించగా.. మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ (Agent Srinivasa Athreya), ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన సినిమా కావడం..’భాగమతి’ (Bhagamathi) తర్వాత ఐదేళ్లకు అనుష్క తెరపై కనిపిస్తుండడం తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది. అలాగే ట్రైలర్ , ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమా ఫై అంచనాలు పెరగడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత అందరిలో కలిగింది. ఆ అంచనాలు , ఆతృతకు తగ్గట్లే మేకర్స్ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమా ను ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇండియా లో కొద్దీ సేపటి క్రితమే షోస్ మొదలవ్వగా..యూఎస్ లో మాత్రం అర్ధరాత్రి నుండే షోస్ మొదలు కావడం తో సినిమా చూసిన సినీ లవర్స్ , అభిమానులు సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాకు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. కథ చిన్నదే అయినప్పటికీ సినిమాలో కంటెంట్ ఉందని.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. కామెడి బాగా వర్కౌట్ అయ్యిందని, సూపర్ ఫన్..అందరు చూడాల్సిన సినిమా. అనుష్క మరోసారి అదరగొట్టిందని, ఫస్టాఫ్ ఫన్.. సెకండాఫ్ ఎమోషనల్ గా సాగిందని చెపుతున్నారు.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ తర్వాత నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవడం పక్కా అంటున్నారు. ఆయన కామెడీ టైమింగ్ గురించి కొందరు ప్రత్యేకంగా పోస్టులు చేస్తున్నారు. ‘భాగమతి’ తర్వాత ఐదేళ్లకు థియేటర్లలోకి వచ్చిన అనుష్క మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిందని మరికొంతమంది అంటున్నారు.
Read Also : Petrol-Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
రీసెంట్ గా వచ్చిన తెలుగు చిత్రాల్లో ఇదొక బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు. కథాంశం చిన్నది అయినప్పటికీ… కామెడీ సినిమాను గట్టెక్కించిందని చెపుతున్నారు. మరికొంతమంది ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలతో పోలుస్తున్నారు. సిట్యువేషన్ పరంగా వచ్చే కామెడీ సీన్లు క్లిక్ అయ్యాయని అంటున్నారు. కామెడీ టైమింగ్ విషయంలో ముందు సినిమాలతో నవీన్ పోలిశెట్టి తాను ఏంటో ప్రూవ్ చేసుకున్నారని అంటున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. మరి సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలియాలంటే పూర్తి రివ్యూస్ వచ్చే వరకు ఆగాల్సిందే. మరికాసేపట్లో పూర్తి రివ్యూ ను మీకు అందజేస్తాం.