Site icon HashtagU Telugu

Mirzapur Actor Died: మిర్జాపూర్ నటుడు షానవాజ్ మృతి

Mirjapur

Mirjapur

ప్రముఖ బాలీవుడ్ (Bollywood) నటుడు షానవాజ్ ప్రధాన్ (56) గుండెపోటుతో మృతి చెందారు. ముంబైలో శుక్రవారం జరిగిన అవార్డుల ఫంక్షన్‌లో షానవాజ్ ఛాతీలో నొప్పి వస్తోందంటూ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను కోకిలాబెన్ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు ధృవీకరించారు. పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్న ‘లగాన్’ నటుడు యశ్‌పాల్ శర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు. అందరి కళ్ల ముందే ఆయన ప్రాణాలు వదిలారని తెలిపాడు.

‘ముంబైలో అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యా. వందలాది మంది ఆర్టిస్టులతో మొత్తం ప్రాంగణం కళకళలాడుతోంది. ఇంతలో పురస్కారం అందుకున్న షానవాజ్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే కార్యక్రమం నిలిపివేసి ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ షానవాజ్‌ను బతికించుకోలేకపోయాం. అందరూ చూస్తుండగానే ఆయన ప్రాణాలు వదిలారు’ అని యశ్‌పాల్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా, షానవాజ్.. ‘అలిఫ్ లైలా’, ‘హరి మర్చి లాల్ మర్చి’, ‘బంధన్ సాత్ జన్మోన్ కా’ సహా మరికొన్ని పాపులర్ సీరియల్స్ లో యాక్ట్ చేశారు. ‘ప్యార్ కోయీ ఖేల్ నహీ’, ‘ఫాంటమ్’, ‘రేస్’ లాంటి చిత్రాల్లోనూ నటించారు. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

Exit mobile version