తేజ సజ్జ (Teja Sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ మూవీ మిరాయ్ (Mirai ) తాజాగా థియేటర్లలో విడుదలైంది. హనుమాన్తో ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జ నుండి వచ్చిన ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే, సినిమా విడుదలకు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజే అద్భుతమైన ఓపెనింగ్‌ను సాధించింది.
సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం..మిరాయ్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 27.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇది తేజ సజ్జ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ కావడం విశేషం. గతంలో వచ్చిన ఆయన సూపర్ హిట్ చిత్రం హనుమాన్ తొలిరోజు రూ. 8 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టగలిగింది. మిరాయ్ ఈ రికార్డును సులభంగా అధిగమించి, బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఈ విజయం తేజ సజ్జకు పాన్-ఇండియా స్టార్‌గా స్థానాన్ని పదిలం చేసింది.
Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
మిరాయ్కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ లభించడం ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణం. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, అలాగే ప్రభాస్ వాయిస్ ఓవర్ వంటి అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధించింది. సాక్నిల్క్ నివేదిక ప్రకారం, తెలుగులో తొలిరోజు ఆక్యుపెన్సీ 68.59%గా నమోదైంది. హిందీ, ఇతర భాషల్లోనూ ఈ చిత్రం మంచి స్పందనను అందుకుంది.
మిరాయ్ మొదటి రోజు సాధించిన ఈ విజయం చిత్ర బృందానికి, అభిమానులకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, వారాంతంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వేగంతో సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హనుమాన్ తర్వాత తేజ సజ్జకు ఇది మరో పెద్ద హిట్ అని అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.