న్యాచురల్ స్టార్ నాని (Nani) వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో సరిపోదా శనివారం సినిమా వస్తుంది. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య డివివి నిర్మిస్తున్నారు. సినిమాలో నాని కి జతగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. వివేక్ ఆత్రేయతో నాని ఆల్రెడీ అంటే సుందరానికీ సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా అంత గొప్పగా ఆడలేదు. అయితే ఆ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించింది. అందుకే వివేక్ ఆత్రేయకు మరో ఛాన్స్ ఇచ్చాడు నాని.
సరిపోదా శనివారం సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కచ్చితంగా కమర్షియల్ హిట్ టార్గెట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు నాని భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం నాని సరిపోదా శనివారం సినిమాకు దాదాపు 25 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడని టాక్. నాని కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది.
దసరా తో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన నాని ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్నతో కూడా డీసెంట్ హిట్ అందుకున్నాడు. అందుకే నాని అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నారు. టైర్ 2 హీరోగా నాని మినిమం గ్యారెంటీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. సినిమా బడ్జెట్ అంతా కలిపి 30 కోట్లకు అటు ఇటుగా పూర్తి చేస్తే సినిమా ఎలాగు బిజినెస్ బాగానే చేస్తుంది. అదీగాక సినిమా కథలు బాగుంటాయి కాబట్టి సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. సో నాని కి పాతిక కోట్లు ఇచ్చినా తప్పులేదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.