Mily Beauty Tamannah డైరెక్టర్ సంపతి నంది కేవలం డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా చేస్తుంటాడు. అతను నిర్మించిన సినిమాలు మంచి కంటెంట్ తో వస్తుంటాయి. సంపత్ నంది ప్రొడక్షన్ లో వచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీ ఓదెల రైల్వేస్టేషన్. హెబ్భా పటేల్, పూజిత పొన్నాడా కలిసి నటించిన ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ స్కిప్ చేసి ఓటీటీ రిలీజ్ చేశారు. ఆహాలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు మేకర్స్.
We’re now on WhatsApp : Click to Join
అశోక్ తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓదెల రైల్వేస్టేషన్ సినిమా సీక్వెల్ కథ సిద్ధమైందట. ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. సంపత్ నంది డైరెక్ట్ చేసిన రచ్చ సినిమా నుంచి తమన్నాతో మంచి రిలేషన్ షిప్ ఉంది. అతను చేసిన ప్రతి సినిమాలో తమనాని హీరోయిన్ గా తీసుకుంటాడు సంపత్. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు ఓదెల రైల్వేస్టేషన్ సీక్వెల్ లో తమన్నాని నటింపచేయాలని అనుకుంటున్నారట.
తమన్నా కూడా ఇప్పుడు ఎలాంటి క్రేజీ ఛాన్స్ వచ్చినా వదులుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో సీరీస్ లతో హంగామా చేస్తున్న తమన్నా ఓదెల రైల్వేస్టేషన్ సినిమాలో కూడా నటిస్తే ఆమె క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమాలో హెబ్భా పటేల్ డీ గ్లామర్ రోల్ లో నటించింది. మరి తమన్నా కూడా అలాంటి పాత్రలో కనిపిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Also Read : Shobha Shetty Yaswanth Reddy Engagement : హౌస్ లో అనౌన్స్ మెంట్.. ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్..!