Site icon HashtagU Telugu

Janhvi Mili First Look: నర్సు పాత్రలో జాన్వీ కపూర్.. ‘మిలీ’ ఫస్ట్ లుక్ అదుర్స్

Janhvi

Janhvi

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో సంబంధం లేకుండా జాన్వీ ప్రత్యేకార్షణగా నిలుస్తూనే ఉంది. చివరిసారిగా ‘గుడ్ లక్’ చిత్రంలో కనిపించిన జాన్వీ కపూర్ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుతో రాబోతోంది. అదే మిలీ మూవీ. తన తండ్రి బోనీ కపూర్‌తో కలిసి నటించిన మొదటి చిత్రం. జాతీయ అవార్డు గ్రహీత మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించిన ఈ సర్వైవర్ థ్రిల్లర్ చిత్రం మలయాళ చిత్రం హెలెన్‌కి రీమేక్. ఈ చిత్రంలో జాన్వీతో పాటు సన్నీ కౌశల్, మనోజ్ పహ్వా కూడా నటిస్తున్నారు.

సినిమా గురించి ఏదైనా అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్వీ కపూర్ ఎట్టకేలకు మిలీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది. పోస్టర్‌లో జాన్వీ నిజంగా ఉల్లాసంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె లుక్ చాలా సింపుల్‌గా ఉంది. జాన్వీ నేవీ బ్లూ టాప్ ధరించి పోనీటైల్‌లో ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో నటి నర్సుగా నటిస్తుంది. ఆమె పాత్ర పేరు మిలి నౌడియాల్, ఆమె వయస్సు, ఆమె నర్సింగ్ గ్రాడ్యుయేట్ వివరాలు కూడా మెన్షన్ చేసింది.  “మిలీకి జాతీయ అవార్డు గ్రహీత, మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 4న పెద్ద తెరపైకి తీసుకురావడానికి టీమ్ అంతా ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం మిలీ ఫస్ట్ పోస్టర్ బాలీవుడ్ లో ఆసక్తిని రేపుతోంది.