Michael Gambon : హ్యారీ పోటర్‌ నటుడు మృతి

హాగ్వార్ట్స్ హెడ్‌మాస్టర్ ఆల్బస్ డంబుల్‌డోర్ పాత్ర‌లో ఆయ‌న న‌ట‌నతో ప్రేక్ష‌కుల మ‌న‌స్సులో చెద‌ర‌ని ముద్ర వేశాడు. ఐరిష్‌ నటుడి మరణవార్త ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది

Published By: HashtagU Telugu Desk
Michael Gambon Dies

Michael Gambon Dies

హాలీవుడ్ లో చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. హ్యారీ పోటర్‌ ఫేమ్‌ సర్‌ మైఖేల్‌ గాంబోన్‌ (Michael Gambon) (82) కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. గాంబోన్‌ మరణవార్తను ఆయన ఫ్యామిలీ ధృవీకరించింది. “సర్ మైఖేల్ గాంబోన్‌ను ఇక లేరు అని చెప్పాలంటేనే ఎంతో బాధ‌గా ఉంది. భార్య అన్నే, కుమారుడు ఫెర్గస్‌లు ఆస్ప‌త్రిలో మైఖేల్ బెడ్ వ‌ద్ద ఉండ‌గానే అత‌డు ప్ర‌శాంతంగా మ‌ర‌ణించాడు.” అని అతని కుటుంబం తెలిపింది.

హ్యారీ పోట‌ర్ సిరీస్‌లో దాదాపు ఆరింటిలో ఆయ‌న న‌టించారు. హాగ్వార్ట్స్ హెడ్‌మాస్టర్ ఆల్బస్ డంబుల్‌డోర్ పాత్ర‌లో ఆయ‌న న‌ట‌నతో ప్రేక్ష‌కుల మ‌న‌స్సులో చెద‌ర‌ని ముద్ర వేశాడు. ఐరిష్‌ నటుడి మరణవార్త ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

మైఖేల్‌ గాంబోన్‌ 1940 అక్టోబర్‌ 19న ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జన్మించిన ఆయన లండన్‌లో పెరిగారు. మొదట ఇంజినీర్‌గా శిక్షణ పొందారు. ఆ తర్వాత నాటకరంగంలో నుంచి సినిమాల్లోకి వచ్చారు. మూడు ఆలివర్‌ అవార్డులు, రెండు స్క్రీన్‌ యాక్టర్‌ అవార్డులతో పాటు నాలుగు బ్రిటీష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (BAFTA) అవార్డులను అందుకున్నారు. నాటకరంగంలో ఆయన చేసిన సేవకు క్వీన్ ఎలిజబెత్ II 1998లో ‘నైట్స్‌’ బిరుదును ప్రదానం చేశారు. 2015లో ఆయన సినిమాలకు వీడ్కోలు పలికారు.

  Last Updated: 28 Sep 2023, 09:35 PM IST