ఈటీవీ విన్ ఓ కొత్త ప్రేమకథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. “మేమిద్దరం” (Memiddaram )పేరుతో జూలై 27న ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ఒక అందమైన ప్రేమ కథ. కానీ ఊహించని కుటుంబ బంధాల మధ్య చిక్కుకున్న సంబంధాల కథ. ‘‘కథా సుధ’’ నుంచి వచ్చిన ఈ భావోద్వేగ రైడ్‌లో ప్రేమ గెలుస్తుందా? లేక బాధ్యతల భారమే విజయం సాధిస్తుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.
PM Modi : మాల్దీవులకు చేరుకున్న ప్రధాని మోడీ ..ద్వైపాక్షిక సంబంధాలకు నూతన గమ్యం
ఈ కథలో ఇద్దరు ప్రాణస్నేహితులు ప్రేమలో పడతారు. కానీ వారి మధ్య అనుకోని కుటుంబ సంబంధం అడ్డుపడుతుంది. ప్రేమకు అడ్డయినా ఈ పరిస్థితుల్లో వారు తాము తీసుకునే నిర్ణయాలు, వారి భావోద్వేగాల మధ్య జరిగే సంఘర్షణలే ప్రధాన ఇతివృత్తం. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు… మనసుకు హత్తుకునే కుటుంబ విలువలు, బాధ్యతలు, త్యాగాల కథ. ఈటీవీ విన్ వరుసగా హృదయాన్ని తాకే కథనాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది, ‘‘మేమిద్దరం’’ కూడా అదే కోవలో ఉండబోతోంది. ఈ కథ కి హేమంత్ కృష్ణ డైరెక్ట్ చేయగా, ఇంద్రజ , రవి వర్మ, అజిత్, ఐశ్వర్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ హేమంత్ కృష్ణ విషయానికి వస్తే తెలుగు లో పెద్ద డైరెక్టర్స్ వద్ద పనిచేసిన అనుభవం ఉంది. అలాగే కన్నడ లో రేస్ అనే మూవీని డైరెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మేమిద్దరం తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
Parliament Session : రాజ్యసభలో కమల్‌హాసన్ ప్రమాణస్వీకారం
#Memiddaram #ETVWin, #WinThoWinodam వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ఇప్పటికే ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ కథలో పాత్రలు జీవించగా, ప్రతీ ఒక్కరి మనసులో ప్రేమకు, కుటుంబానికి మధ్య ఉన్న ఆంతర్యాన్ని సునిశితంగా చూపించే ప్రయత్నం చేశారు. జూలై 27న ప్రీమియర్ కాబోతున్న ఈ కథను తప్పక వీక్షించాల్సిందేనని ఈటీవీ విన్ చెబుతోంది.