Site icon HashtagU Telugu

Kalki 2898 AD : కల్కి యానిమేషన్ సిరీస్‌లో.. మీమ్స్‌ని బాగా వాడేసారుగా.. ఏంటి జోకా..!

Memes Reference In Prabhas Kalki 2898 Ad Bujji And Bhairava Series

Memes Reference In Prabhas Kalki 2898 Ad Bujji And Bhairava Series

Kalki 2898 AD : సి అశ్విని దత్ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 ఏడి’. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతుంది. అంతేకాదు ఈ సినిమాతో ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాటిక్ యూనివర్స్ ఆడియన్స్ కి అర్థంకావడం కోసం.. మేకర్స్ ఒక యానిమేటెడ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

ఈక్రమంలోనే నేడు బుజ్జి అండ్ భైరవ అనే సిరీస్ ని రిలీజ్ చేసింది. రెండు ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఫ్యూచరిస్టిక్ ఇండియాలో కాశీ నగరం ఎలా ఉండబోతుందో అనేది చాలా బాగా చూపించారు. అంతేకాదు, అడ్వాన్స్‌డ్ వెహికల్స్ అండ్ వెపన్స్, డిజిటల్ మనీ.. ఇలా ప్రతి విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్త తీసుకోని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇలా సర్‌ప్రైజ్ చేసే విషయాలతో పాటు ఎంటర్టైన్ చేసే మీమ్స్ ని కూడా మేకర్స్ బాగా ఉపయోగించుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని మీమ్స్ ని నాగ్ అశ్విన్ బాగా ఉపయోగించుకున్నారు. ఇయ్యూ, తెలుగు భాషలో నాకు నచ్చని పదం, లివింగ్ లెజెండ్, ఏంటి జోకా నవ్వాలా.. అనే మీమ్స్ ని ఈ సిరీస్ లోని పాత్రలతో చెప్పించి మెప్పించారు. మరి ఈ మీమ్స్ రిఫరెన్స్ కేవలం సిరీస్ వరుకేనా..? లేక మూవీలో కూడా కనిపిస్తుందా..? అనేది చూడాలి. కాగా ఈ సిరీస్ లో మరో రెండు ఎపిసోడ్స్ ని కూడా రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఆ రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.