Site icon HashtagU Telugu

Mem Famous Trailer: బర్త్ డే రోజు ఎవడైనా కేక్ కట్ చేయిస్తడు. కల్లు తాగిపిస్తాడా?

Mem Famous

Mem Famous

ఇటీవల లోకల్ టాలెంట్ ను ఓ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. బలగం, డిజే టిల్లు లాంటి సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త సినిమాలు తెలుగు ప్రేక్షకులను రంజింపచేసేందుకు ముస్తాబవుతున్నాయి. రీసెంట్ గా ‘మేమ్ ఫేమస్’ (Mem Famous) అనే ఓ మూవీ విడుదలకు ముందే ఆసక్తిని రేపుతోంది. టీజర్‌ నుంచి పాటల వరకు ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు.

హీరో తన గ్యాంగ్ ను వెంటేసుకొని ఊళ్లో తిరుగుతుంటాడు. ఫుల్ టూ బిందాస్ టైప్‌లో జీవితాన్ని (Life) ఎంజాయ్ చేస్తుంటారు. పెద్దగా కలలు కనరు. వీరికి గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటారు కానీ జీవితంలో స్థిరపడాలనే చింత ఉండదు. వీళ్ల చేష్టలకు ప్రతి ఒక్కరూ తిట్టుకుంటారు. తన ప్రేయసి పుట్టినరోజుకు అదిరిపొయే సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తాడు హీరో.  ‘‘బర్త్ డే అయితే ఎవడైనా కేక్ కట్ చేయిస్తాడు. కానీ కల్లు తాపిస్తాడా?’’ అనే డైలాగ్ ఆకట్టుకుంది.  కథానాయకుడు తన ప్రేయసి తండ్రికి.. తాను పేరు తెచ్చుకున్నప్పుడే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని సవాలు చేస్తాడు. ఈ నేపథ్యంలో హీరో,  అతని గ్యాంగ్ ఏం చేస్తారు అనేది సస్పెన్స్ గా ఉంటుంది.

యువతకు కంటెంట్ నచ్చుతుంది. సుమంత్ ప్రభాస్ వినోదభరితమైన (Fun movie) ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సుమంత్ ప్రభాస్ నేచరల్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి స్నేహితులుగా మంచిగా నటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ, కళ్యాణ్ నాయక్ సినిమాటోగ్రఫీ పెద్ద ఎసెట్. చై బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మించింది. ట్రైలర్ ద్వారా మెమ్ ఫేమస్ యువతను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

Also Read: Bihar Woman: ఈ పెళ్లి నాకొద్దు, కళ్యాణ మండపంలో పెళ్లికొడుకును చూసి షాకైన పెళ్లికూతురు!