Site icon HashtagU Telugu

Mehreen: ముఖం నిండా సూదులతో మెహ్రీన్

Mehreen

Mehreen

‘హని ఈజ్‌ ద బెస్ట్’ అంటూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ మెహ్రీన్‌. ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు అనుకున్న స్థాయిలో అలరించలేకపోయినా ‘ఎఫ్‌2’ తో మళ్లీ ఫాంలోకి వచ్చింది ఈ అందాల తార. తాజాగా మెహ్రీన్‌ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ముఖం నిండా సూదులతో ఉన్న ఫొటోని మెహ్రీన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఏమైందంటూ అభిమానుల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆక్యుపంక్చర్ (Acupuncture) ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే దీనిపై నెటిజన్లు మిశ్రమస్పందన తెలియజేస్తున్నారు. ‘మీరు సహజంగానే అందంగా ఉంటారు’ అని ఒకరంటే ‘ఇలాంటి వాటితో జాగ్రత్త’ అని మరొకరు కామెంట్‌ చేశారు

Exit mobile version