- పెళ్లి వార్తలపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
- ఇకపై తన పెళ్లి విషయంపై పుకార్లు ఆపమని కోరిన మెహ్రీన్
Mehreen Pirzada: తను పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన తప్పుడు కథనాలపై నటి మెహ్రీన్ పిర్జాదా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన మీడియా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచురించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గత రెండేళ్లుగా తనపై ఎన్ని పుకార్లు వచ్చినా మౌనంగా ఉన్నానని, కానీ ఈసారి స్పందించడం అవసరమని భావిస్తున్నానని ఆమె తెలిపారు.
తాను వివాహం చేసుకోలేదని మెహ్రీన్ స్పష్టం చేశారు. మీడియా కథనంలో పేర్కొన్న వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని ఆమె చెప్పారు. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని, అది ఎంతో బాధాకరమని ఆమె పేర్కొన్నారు. “నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, స్వయంగా ప్రపంచానికి ఆ విషయాన్ని తెలియజేస్తాను. దయచేసి అప్పటివరకు ఇలాంటి పుకార్లను నమ్మకండి” అని ఆమె కోరారు.
Also Read: నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివరాలీవే!
గత రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది. ఆ వ్యక్తితో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి నిరాధారమైన వార్తలు ప్రచారం చేయడం ఆపండి అని స్వయంగా తెలిపారు.
మెహ్రీన్ కౌర్ పిర్జాదా 2016లో నాని సరసన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, F3, పంతం, కవచం, ఎంత మంచివాడవురా వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2023లో ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ వెబ్ సిరీస్‌తో ఆమె డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి కూడా అడుగుపెట్టారు.
