Site icon HashtagU Telugu

Meher Ramesh: పవన్ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేశా: మెహర్ రమేష్‌

Another chance for Meher Ramesh is difficult

Another chance for Meher Ramesh is difficult

Meher Ramesh: భోళా శంకర్‌తో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే సువర్ణావకాశం మెహర్ రమేష్‌కి వచ్చింది. కానీ ఆ ఛాన్స్ ను ఉపయోగించుకోకుండా సినిమాని ఫెయిల్యూర్ గా మిగిల్చాడు. విడుదల తర్వాత, మెహర్ ఎక్కడా మీడియాలో లేదా ఏ ఈవెంట్‌లలో కనిపించలేదు. తాజాగా అతడు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్‌ మూవీకి నేను దర్శకత్వం వహిస్తాను. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందని అని చెప్పాడు. మెహర్ రమేష్‌కి పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసే నేర్పు ఉంది కానీ అవన్నీ పెద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. మరి ఇప్పుడు ఏ హీరో సినిమా డైరెక్షన్‌ అవకాశం ఇస్తాడో చూడాలి మరి. పవన్ కళ్యాణ్ గురించి కలలు కంటున్న మెహర్ కు అవకాశం అంత ఈజీ కాదని ఫ్యాన్స్ అంటున్నారు.

Also Read: Nagarjunasagar issue: ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు