చిత్రసీమలో డైరెక్టర్ మెహర్ రమేష్ (Meher Ramesh) అంటే అభిమానులు, సినీ లవర్స్ మాత్రమే కాదు నిర్మాతలు సైతం వామ్మో అంటారు. దానికి కారణం ఆయన తీసిన డిజాస్టర్లే. జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘శక్తి’ సినిమా ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా నిలవడమే కాకుండా, విక్టరీ వెంకటేష్‌తో తీసిన ‘షాడో’ మరో డిజాస్టర్ గా నిలిచింది. షాడో తర్వాత రమేష్ తో సినిమాలు చేసేందుకు, తీసేందుకు నిర్మాతలు కానీ , హీరోలు కానీ సాహసం చేయలేదు. దీంతో కొద్దీ నెలల పాటు ఖాళీగా ఉన్నాడు. ఆ మధ్య చిరంజీవి భోళాశంకర్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఇది తమిళం లో అజిత్ హీరోగా వచ్చిన ‘వేదాళం’ రీమేక్. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన ఈ రీమేక్ కూడా భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా తర్వాత చిరంజీవికి పరువు నష్టం తో పాటు విమర్శలు ఎదురుకున్నారు. రమేష్ తో సినిమా చేయాలనీ ఎలా అనుకున్నారని మెగా అభిమానులు కూడా ప్రశ్నించారు.
Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో
అయితే అందరి ఊహలకు విరుద్ధంగా మెహర్ రమేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘పెద్దన్న చిరంజీవి తో సినిమా చేశా. చిన్నన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారితో కూడా తప్పకుండా సినిమా చేస్తా. దీనిలో ఎలాంటి సమస్య లేదు’’ అని చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంకా అడిగితే.. ‘‘నేను ఫిక్సయ్యా. పవన్ గారితో సినిమా 100 శాతం చేస్తా’’ అని ధీమా వ్యక్తం చేశారు. రమేష్ వ్యాఖ్యలు విన్న అభిమానులు వామ్మో వద్దయ్యా.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్నాడు..ఇలాంటి ఈ సమయంలో నువ్వు సినిమా చేయొద్దంటూ కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్న నేపథ్యంలో, కొత్త సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశాలు లేవని ఆయన అభిమానులు భావిస్తున్నారు. జనసేన–బీజేపీ–తెలుగుదేశం కూటమిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పవన్ రాజకీయ బాధ్యతల్లో తలమునకలై ఉన్నారు. దీంతో మెహర్ చెప్పిన మాటలు నిజమవుతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే. కానీ మెగాస్టార్ కుటుంబానికి ఉన్న సంబంధాలు, అనుబంధాలతో మరో అవకాశం దక్కే అవకాశం లేకపోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.