తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెహబూబ్ యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్,అలాగే టిక్ టాక్ లో అదిరిపోయే విధంగా స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అలా తనకున్న క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెహబూబ్ కు ఉన్న పాపులారిటీ క్రేజ్ మరింత పెరిగింది.
బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా మెహబూబ్ యూటూబ్ లో కొన్ని రకాల వెబ్ సిరీస్ లలో నటిస్తూ అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే పండుగ ఈవెంట్లో కూడా సందడి చేశాడు. అంతే కాకుండా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టిన మెహబూబ్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇలా ఉంటే తాజాగా మెహబూబ్ రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ పండుగ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఈ పండుగ సందర్భంగా ఆ హ్యాపీనెస్ ని మరింత డబుల్ చేసుకుంటూ కొత్త కారుని కొనుగోలు చేశాడు మెహబూబ్.ఈద్ పండగ సందర్భంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును ఇంటికి తెచ్చుకున్నాడు. దీని ధర రూ.15 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్ కలర్‌లో మెరిసిపోతున్న కారు ముందు దిగిన ఫోటోలను మెహబూబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బ్లాక్ కలర్ కారు ముందు మ్యాచింగ్ అయ్యే బ్లాక్ కలర్ దుస్తులు ధరించిన మెహబూబ్ సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అవి కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోస చూసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సోహైల్, శ్రీరామచంద్ర, కాజల్, అర్జున్ కల్యాణ్, రవికృష్ణ తదితరులు మెహబూబ్ కి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రంజాన్ మాసం కావడంతో తన స్నేహితులకు ఇఫ్తార్ పార్టీ కూడా ఇచ్చాడు మెహబూబ్.