Site icon HashtagU Telugu

Srikanth Odela – Chiranjeevi : దసరా డైరెక్టర్ తో మెగాస్టార్..?

Srikanth Chiru

Srikanth Chiru

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన ఆలోచనలను పూర్తిగా మార్చుకున్నాడు. ఒకప్పుడు సీనియర్ డైరెక్టర్లకు మాత్రమే ఎక్కువగా ఛాన్స్ ఇచ్చేవారు..కానీ ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ల కంటే కొత్త యంగ్ డైరెక్టర్స్ చాల బాగా సినిమాలు తీస్తుండడం తో సరికొత్త కధాంశంతో తెరకెక్కిస్తుండడం తో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాదిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన లక్కీ బస్టర్ , క మూవీస్ ఉదాహరణ. ఈ తరుణంలో చిరంజీవి దసరా డైరెక్టర్ (Srikanth Odela) కు ఛాన్స్ ఇచ్చాడనే వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వంభ‌ర‌ మూవీ చేస్తున్నాడు. సమ్మర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. దసరా మూవీతో శ్రీకాంత్ ఓదెల తన సత్తాను చాటుకున్నాడు. మొదటి సినిమాతోనే వంద కోట్లు కొల్లగొట్టేశాడు. ఇప్పుడు నానితో మరో మూవీని ప్లాన్ చేశాడు. అది మరింత అగ్రెస్సివ్‌గా, రక్తపాతాన్ని చిందించేలా ఉంటుందని సమాచారం. అలాగే మొదటి నుండి శ్రీకాంత్ చిరుకు వీరాభిమాని..చిరంజీవితో సినిమా అనేది శ్రీకాంత్‌కు డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే చిరు స్థాయికి తగ్గట్టుగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ని సిద్ధం చేసాడట. చిరు మూవీకి కావాల్సింది ఉంటూ..తన మార్క్ చూపించేలా ఆ మూవీ ఉంటుందని వినికిడి.నానితో పారడైజ్ మూవీని కంప్లీట్ చేసిన తరువాత చిరుతో ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడని అంటున్నారు. మరి ఈ మూవీ ని ఎవరు నిర్మిస్తారో..? ఎలాంటి కధో..? కాస్ట్ & క్రూ వివరాలు ఏంటో అనేవి మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు.

Read Also : Lucky Bhaskar : OTTలో అదరగొడుతున్న లక్కీ భాస్కర్