Site icon HashtagU Telugu

Megastar Viswambhara vs Prabhas Raja Saab : మెగాస్టార్ ని ఆపుతారా.. స్నేహితుల కోసం ప్రభాస్ త్యాగం చేస్తాడా..?

Megastar Viswambhara Vs Prabhas Raja Saab

Megastar Viswambhara Vs Prabhas Raja Saab

Megastar Viswambhara vs Prabhas Raja Saab ప్రతి సంక్రాంతి లానే వచ్చే సంక్రాంతికి ఇప్పుడే సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేస్తూ షాక్ ఇస్తున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా 2025 సంక్రాంతి రిలీజ్ లాక్ చేశారు. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ గ్రాండియర్ గా ఉండబోతుంది. సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక మరోపక్క వచ్చే సంక్రాంతికి ప్రభాస్ రాజా సాబ్ ని కూడా దించబోతున్నారని తెలుస్తుంది.

రీసెంట్ గా రాజా సాబ్ నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ రాజా సాబ్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అని అన్నారు. అయితే సంక్రాంతికి ఆల్రెడీ మెగా విశ్వంభర వస్తుంది. చిరు సినిమా నిర్మించేది యువి క్రియేషన్స్ వంశీ ప్రమోద్ లు. వారు ప్రభాస్ కి చాలా మంచి స్నేహితులు.

సో ఫ్రెండ్స్ చేస్తున్న ఈ భారీ సినిమాకు పోటీగా తన సినిమాను వదులుతాడని అనుకోలేం. ప్రభాస్ సినిమా రాజా సాబ్ రిలీజ్ సంక్రాంతికి పక్కా అనుకుంటే విశ్వంభర సినిమానే రిలీజ్ వాయిదా వేసే అవకాశం ఉంటుంది. అయితే చిరు సినిమాను జనవరి 10న రిలీజ్ చేస్తే సంక్రాంతికి అంటే 14, 15 న ప్రభాస్ రాజా సాబ్ వస్తే ఎలాగు మధ్యలో 4, 5 డేస్ ఉంటుంది కాబట్టి రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

చిరు విశ్వంభర, ప్రభాస్ రాజా సాబ్ సంక్రాంతికి ఈ ఫైట్ తప్పేలా లేదు. మరి ఈ రెండు సినిమాలు రిలీజ్ విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Also Read : Venkatesh : వెంకటేష్ కోసం ఈసారి ఆ హీరోయిన్ ని దించుతున్నారా.. సూపర్ హిట్ కాంబో రిపీట్..!