Chiru Avoids Unstoppable: బాలయ్యకు చిరు షాక్.. సుమ అడ్డాలోకి మెగాస్టార్!

మెగాస్టార్ (Megastar) చిరు ఇప్పట్లో అన్ స్టాబబుల్ షోలో కనిపించే సూచనలు ఏమీ కనిపించడం లేదు.

  • Written By:
  • Updated On - January 7, 2023 / 04:08 PM IST

టాలీవుడ్ (Tollywood) ఎంటర్ టైన్ మెంట్ షోస్ లో ‘అన్‌స్టాపబుల్’ కు ఉన్న క్రేజ్ మరేదానికి లేదు. “అన్‌స్టాపబుల్ 2”లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ సందడి చేయడంతో ఎన్ బీకే షోకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అయితే నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న ఈ సూపర్‌హిట్ టాక్ షోకి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వస్తాడని చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ చిరంజీవి (Chiranjeevi) బాలయ్యకు షాక్ ఇస్తూ.. కొత్త టాక్ షో షూట్‌లో కనిపించనున్నాడు.

‘కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ’ కార్యక్రమం మాదిరిగా ప్రముఖ యాంకర్ సుమ (Anchor Suma) “సుమ అడ్డా” అనే టాక్ షోతో ముందుకు వచ్చింది. ఈ షో మొదటి ఎపిసోడ్‌లో అలీ, పోసాని, కొరియోగ్రాఫర్లు శేఖర్ మరియు జానీ, సంతోష్ శోభన్ అతిథులుగా వచ్చారు. ఇక ఈ గేమ్ షో రెండవ ఎపిసోడ్‌ని మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. ఆయనతో పాటు దర్శకుడు బాబీ కొల్లి కూడా పాల్గొన్నారు.

మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న షోకి చిరు (Chiranjeevi) ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాడనీ, తన బావ అల్లు అరవింద్‌కి అంత ప్రాధాన్యం ఇవ్వలేదని పలువురు ఆశ్చర్యపోతున్నారు. కాగా చిరు బాలయ్య టాక్ షోలో తప్పనిసరిగ్గా కనిపిస్తారని మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. అయితే బాలయ్య టాక్ షో ప్రారంభంలోనే చిరంజీవి వస్తారని, ఇద్దరూ స్టార్స్ ను ఒకే ఫ్రేమ్ లో చూడొచ్చని భావించినా ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. ఇక చిరు అన్ స్టాబబుల్ షోలో ఎప్పుడూ కనిపిస్తారనేది ? వేచి చూడాల్సిందే మరి.

Also Read: Adivi Sesh: టాలీవుడ్ హీరోలపై అడివి శేష్ సంచలన కామెంట్స్