Site icon HashtagU Telugu

Megastar Chiranjeevi: బ్లాక్ బస్టర్ జైలర్ మూవీని రిజెక్ట్ చేసిన చిరంజీవి, కారణమిదే!

Chiru And Rajani

Chiru And Rajani

రజనీకాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ “జైలర్,” బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన రెండవ తమిళ చిత్రంగా నిలిచింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ రజనీకి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. అయితే రజనీకాంత్ కు ముందు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మరో నటుడిని హీరోగా పెట్టుకునేందుకు ఆసక్తి చూపారట.

“జైలర్”లో ప్రధాన పాత్ర కోసం “మెగాస్టార్” అని పిలవబడే తెలుగు నటుడు అయినన చిరంజీవిని నటింపచేయాలని భావించారు. అయితే, సినిమాలో పాటలు, డ్యాన్స్ సీక్వెన్సులు లేవని పేర్కొంటూ చిరంజీవి ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చిరంజీవి సినిమాలు చాలా వరకు పాటలతో కూడుకున్నవే. దీంతో ఆ ఆఫర్‌ను పూర్తిగా తిరస్కరించి “తర్వాత చూద్దాం” అని చెప్పాడట చిరంజీవి. ఈ విషయం జైలర్ టీం అధికారికంగా ధృవీకరించకనప్పటికీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం “జైలర్” ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్ల గ్రాస్ వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్‌ను చవిచూస్తోంది. ఇది మలేషియాలో అత్యధిక బాక్స్-ఆఫీస్ కలెక్షన్ పరంగా షారుఖ్ ఖాన్ “దిల్వాలే”ని కూడా అధిగమించింది, ఈ ఘనతను చిత్ర నిర్మాణ మరియు పంపిణీ సంస్థ సెలబ్రేషన్స్ జరుపుకొని మూవీలో నటించినవారికి భారీగా గిఫ్టులు కూడా ఇచ్చింది. అయితే ఆచార్య, భోళాశంకర్ మూవీలతో ఘోరంగా నిరాశపర్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ కనుక చేసుకుంటే భారీ స్టార్ డమ్ వచ్చి ఉండేది. మార్కెట్లో  చిరంజీవి రేంజ్ ఓ రేంజ్ కు వెళ్లిపోయి ఉండేది.

Also Read: Green India Challenge: మన జీవన ప్రయాణంలో ప్రతీ అంశంలో కాలుష్యం కల్లోల్లం చేస్తోంది: డాక్టర్ సతీశ్ రెడ్డి