Chiranjeevi Dinner Party: చిరు డిన్నర్ పార్టీ.. ‘వీరయ్య’ విజయం అందించేనా!

మెగాస్టార్ (Megastar) చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ టీమ్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.

Published By: HashtagU Telugu Desk
Veerayya

Veerayya

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన వాల్తేర్ వీరయ్య జనవరి 13న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే రిలీజ్ ముందుగానే చిరంజీవి తన టీమ్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ చిత్రంపై తనకు నమ్మకం ఉందని చిరంజీవి చెప్పిన నేపథ్యంలో డిన్నర్ పార్టీకి ప్రాధాన్యత ఏర్పడింది. అంటే చిరంజీవి వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) మూవీతో అంచనాలు అందుకుంటాడని చెప్పకనే చెప్పారు. గతంలో ఇలాగే చిరు ఎన్నో అంచనాలు రేపాడు. ఆచార్య, గాడ్‌ఫాదర్‌ను బాగా హైప్ చేశాడు. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి.

సీన్ కట్ చేస్తే, వీరయ్య యూనిట్‌కి పార్టీ ఇచ్చాడు. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే, వాల్తేరు వీరయ్య టీమ్ నిజంగా అంచనాలను అందజేసిందా? చిరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ హిట్ ను అందిస్తుందా? అనేది చర్చనీయాంశమవుతోంది. అయితే సంక్రాంతి బరిలో వస్తున్న వాల్తేరు వీరయ్యకు పోటీగా నందమూరి బాలయ్య వీరసింహారెడ్డి పోటీగా నిలవనుంది. ఈ నేపథ్యంలో బాలయ్యపై చిరంజీవి (Chiranjeevi) పైచేయి సాధిస్తాడా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్స్ లో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజా లో మెగా ఫ్యాన్స్ (Mega Fans) సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కూడా మెగా ఫ్యాన్స్ ఈ సమావేశానికి వచ్చారు. వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ గురించి చర్చించారు ఈ సమావేశంలో. చిరంజీవితో, చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ గురించి చర్చించాలని, వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ ని మరింత గ్రాండ్ గా చేయాలని డిసైడ్ అయ్యారు. కాగా మరికొందరు అభిమానులు చిరు మాటలను తప్పుపడుతున్నారు. గతంలో సైరా, ఆచార్య సినిమాలు రిలీజ్ అయినప్పుడు చిరంజీవి ఓ రేంజ్ అంచనాలు రేపారు. కానీ ఆ సినిమాలు మోస్తారుగా ఆకట్టుకోవడంతో చిరంజీవి (Chiranjeevi) లీక్స్ స్టార్ అని బహటంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య గట్టి హిట్ కొట్టి మెగా అభిమానులను సాటిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read : Dhamaka Pulsar Bike Song: ‘పల్సర్ బైక్’ పాటతో దుమ్మురేపిన రవితేజ- శ్రీలీల

  Last Updated: 03 Jan 2023, 02:39 PM IST