Site icon HashtagU Telugu

Balagam: మాకు షాకిస్తే ఎలగయ్యా వేణు.. ‘బలగం’ టీమ్ కు చిరంజీవి ప్రశంసలు!

Balagam

Balagam

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మూవీ బలగం. ఈ మూవీ విడుదలై పదిరోజులు కావోస్తున్నా అంతటా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినీ ప్రేక్షకులనే కాకుండా విమర్శకులను సైతం మెప్పుపొందింది. తక్కువ బడ్జెట్‌తో వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇది ఆయనకు ఎంతో బాగా నచ్చడంతో చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు అందరినీ సన్మానించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘సినిమాను అంత బాగా తీసేసి మాకు షాక్ ఇస్తే ఎలాగయ్యా. నీ జబర్ధస్త్ స్కిట్లు చూసేవాడిని. అందులో ఉగ్గుకథలు, బుర్రకథలు చెప్పేవాడివి. ఇప్పుడు సినిమాను చక్కగా తీశావు. మంచి కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నా.. నువ్వు ఎలా తీయాలనుకున్నావో అలాగే తీశావు. అందరికీ కంగ్రాట్స్’ అంటూ అందరినీ సత్కరించారు. ‘బలగం’ మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలు పోషించారు.

వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. అలాగే, ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలను చేశారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు  మంచి కలెక్షన్‌లు సాధిస్తూనే వచ్చింది. ఇప్పటి వరకు ఈ మూవీ రూ.8 కోట్లకు పైగా కలెక్షన్‌లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌ దిశగా సాగుతుంది.