Viswambhara Teaser Talk మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. నేడు విజయ దశమి సందర్భంగా విశ్వంభర సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ప్యూర్ గూస్ బంప్స్ అనిపిస్తుంది. విశ్వంభర టీజర్ విషయానికి వస్తే శత్రునాశనానికి యోధుడిగా వచ్చిన హీరోగా చిరంజీవి కనిపించాడు.
సినిమా కథ, కథనాలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో ఉండేలా కనిపిస్తున్నాయి. చిరంజీవి విశ్వంభర టీజర్ చూసిన మెగా ఫ్యాన్స్ ఈసారి సూపర్ హిట్ కొట్టేస్తున్నాం అంతే అని ఫిక్స్ అయ్యారు. టీజర్ లో కాన్సెప్ట్ గురించి అంత క్లారిటీ ఇవ్వకపోయినా విజువల్స్, యాక్షన్, ఎలివేషన్ ఇవన్నీ అదిరిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర (Viswambhara) టీజర్ తో సినిమాపై అంచనాలను డబుల్ చేశారు.
సినిమా టీజర్ అదిరిపోగా..
Megastar Chiranjeevi చిరు విశ్వంభర సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ ప్రాముక్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. విశ్వంభర సినిమాను 2025 జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
మెగా విశ్వంభర సినిమా టీజర్ అదిరిపోగా సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. టీజర్ తో కామన్ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ పెరిగేలా చేశారు.
Also Read : Jani Master : జానీ మాస్టర్ పై కేసు పెట్టిన యువతి కి షాక్ ఇచ్చిన యువకుడు