మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో బింబిసార డైరెక్టర్ (Bimbisara Director) వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే ఆమెతో పాటు సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ లో ఆషిక రంగనథ్, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఈషా చావ్లా కూడా భాగం అవుతున్నారు.
ఇక ఇప్పుడు సినిమాలో మరో హీరోయిన్ ని కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. మెగా విశ్వంభర సినిమాలో కమల్ గారాల పట్టి శృతి హాసన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఐతే శృతి హాసన్ కేవలం ఒక సాంగ్ కోసమే అంటూ చెబుతున్నారు. చిరంజీవి విశ్వంభర (Chiranjeevi Viswambhara) సినిమా వింటేజ్ చిరుని పరిచయం చేస్తుందని అంటున్నారు.
వశిష్ట చాలా ఫోకస్ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే ఇంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ (Shruthi Hassan) ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. శృతి హాసన్ తో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ విశ్వంభర కోసం స్పెషల్ సాంగ్ చేయనున్నారు.
కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ పరంగా కూడా స్పెషల్ క్రేజ్ ఉండేలా చూస్తున్నారని తెలుస్తుంది. మెగా విశ్వంభర ( Mega Viswambhara) సినిమా 200 కోట్ల బడ్జెట్ తో వస్తుంది. సినిమాపై భారీ అంచనాలు ఉండగా అందుకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాను 2025 జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు. ఐతే సినిమాను డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చిరు ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
Also Read :