Site icon HashtagU Telugu

Megastar Chiranjeevi Viswambhara Release Date : మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ డేట్ లాక్..?

Megastar Chiranjeevi Viswambhara Release Date Lock

Megastar Chiranjeevi Viswambhara Release Date Lock

Megastar Chiranjeevi Viswambhara Release Date మెగాస్టార్ చిరంజీవి మెగా 156 మూవీగా వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన అనుష్క, త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లగా మూవీలో ప్రస్తుతం యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. బింబిసార తో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన వశిష్ట ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ చూపించడానికి ఫిక్స్ అయ్యాడు.

We’re now on WhatsApp : Click to Join

మెగాస్టార్ ని కథ చెప్పి ఒప్పించడం అనేది అంత సామాన్య విషయం కాదు. అలాంటిది విశ్వంభర సినిమాకు చిరుని ఒప్పించి భారీ బడ్జెట్ తో ఆ సినిమా చేస్తున్నారు. విశ్వంభర ఈ సినిమా చిరు జగదేక వీరుడు అతిలోక సుందరి టైపులో ఒక ఫిక్షనల్ కథతో తెరకెక్కుతుంది.

ఈ సినిమాను 2025 సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతి రిలీజ్ అనగానే 12, 13, 14 రిలీజ్ లు చేస్తుంటారు. అందుకే చిరు విశ్వంభర తెలివిగా జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు. 10 నుంచి సంక్రాంతి వరకు లాంగ్ డేస్ ఈ సినిమా చూసేలా మేకర్స్ ప్లాన్ చేశారు.

విశ్వంభర జనవరి 10 రిలీజ్ దాదాపు కన్ ఫర్మ్ అని చెప్పొచ్చు. ఐతే సంక్రాంతికి నాగార్జున, నాగ చైతన్య తండేల్, శర్వానంద్ శతమానం భవతి నెక్స్ట్ పేజ్ రిలీజ్ రెడీ అయ్యాయి. ప్రభాస్ రాజా సాబ్ కూడా సంక్రాంతికే రిలీజ్ అంటున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Sandeep Vanga : యానిమల్ పార్క్ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది.. సందీప్ వంగ ఎలా ప్లాన్ చేస్తున్నాడు..?