Site icon HashtagU Telugu

Chiranjeevi Viswambhara : గుంటూరు కారంతో మెగా విశ్వంభర లింక్ ఏంటి..?

Megastar Chiranjeevi Viswambhara Link with Mahesh Babu Guntur Karam

Megastar Chiranjeevi Viswambhara Link with Mahesh Babu Guntur Karam

Chiranjeevi Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారని తెలుస్తుంది. చిరు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తరహాలో ఫిక్షనల్ మూవీగా విశ్వంభర వస్తుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా చేస్తుందని తెలుస్తుంది.

వీరితో పాటుగా ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా, సురభి కూడా విశ్వంభర సినిమాలో నటిస్తున్నారట. ఈ సినిమాలో చిరుకి నలుగురు చెల్లెళ్లు ఉంటారట. వారి కోసమే ఫేడవుట్ అయిన హీరోయిన్స్ అందరిని తీసుకొస్తున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా లో ప్రస్తుతం చిరంజీవి త్రిషల మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.

ఈ సాంగ్ మహేష్ గుంటూరు కారం కోసం వేసిన ఇంటి సెట్ లోనే జరుగుతుందట. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఇంటి సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నారట. సో అలా గుంటూరు కారం సినిమాకు విశ్వంభర సినిమాకు లింక్ ఏర్పడింది. ఒకే సెట్ లో రెండు సినిమాల షూటింగ్ జరగడం కామనే. సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం సూపర్ హిట్ కాగా ఆ సినిమాలో మహేష్ రమణ పాత్రలో అదరగొట్టాడని తెలిసిందే.