Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా గత సంక్రాంతికే రావాలి. కానీ షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. విశ్వంభర నుంచి గ్లింప్స్ రిలీజయినప్పుడు VFX, గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర ట్రోల్స్ వచ్చాయి. దీంతో మూవీ యూనిట్ వెనక్కు తగ్గింది.
అప్పట్నుంచి మళ్ళీ రీ షూట్స్, VFX విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి సినిమాకు ట్రోల్స్ రాకూడదు అని గట్టిగానే డిసైడ్ అయ్యారట టీం. దీంతో VFX బడ్జెట్ భారీగా పెంచారట. విశ్వంభర సినిమాకు బెస్ట్ గ్రాఫిక్స్, VFX ఇవ్వడానికి అనుకున్న బడ్జెట్ కంటే ఇంకా పెంచారని తాజా సమాచారం.
మొదట VFX కు దాదాపు 50 కోట్లు అనుకున్నారట. కానీ ట్రోల్స్ చూసి ఇంకా బెటర్ అవుట్ పుట్ ఇవ్వాలని ఇంకో 25 కోట్ల వరకు బడ్జెట్ పెంచారట. దీంతో కేవలం విశ్వంభర VFX బడ్జెట్ మాత్రమే 75 కోట్లు దాటిందట. ఇక సినిమా బడ్జెట్, ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్.. ఇవన్నీ కలిపితే టోటల్ విశ్వంభర బడ్జెట్ ఎంత అవుతుందో, అంత రిటర్న్ వస్తుందా అని సందేహం కూడా మొదలైంది.
ఇప్పటికే సినిమా వాయిదా పడింది. మే లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందన్నారు కానీ అది కూడా వాయిదా పడినట్టే. మరి విశ్వంభర ఎప్పుడు VFX వర్క్స్ పూర్తిచేసి రిలీజ్ చేస్తారో, ఏ రేంజ్ లో మెప్పిస్తారో, ప్రాఫిట్స్ వస్తాయా చూడాలి.
Also Read : Samantha : రూమర్ బాయ్ ఫ్రెండ్ తో తిరుమలలో సమంత.. పెళ్లి వార్తలు..?