Bharat Ratna For NTR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారకరామారావు 101 వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి, ఇతర ప్రముఖులు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తనని గుర్తు చేసుకున్నారు.
ఈ రోజు ఎన్టీఆర్ 101 వర్ధంతి సందర్భంగా తెలుగు చిత్రసీమలో అగ్రహీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. పలువురు ఈ విషయాన్నీ ప్రధాని దృష్టికీ కూడా తీసుకెళ్లారు. అంతేకాదు భారత ప్రభుత్వం ఎన్టీఆర్‌ను ప్రతిష్టాత్మక భారతరత్నతో సత్కరించాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. మరి తెలుగు ప్రజల, సినీ, రాజకీయ ప్రముఖుల అభ్యర్థనలను ప్రభుత్వం వింటుందని, వచ్చే ఏడాదిలోగానైనా ఎన్టీఆర్‌కి భారతరత్న ఇచ్చి గౌరవించాలని ఆశిస్తున్నారు.
Also Read: EC : పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు