Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ పై ‘మెగా’ ట్వీట్ వైరల్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' మూవీ విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Chiru Pawan Rana

Chiru Pawan Rana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుచోట్ల ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది ‘భీమ్లా నాయక్’. ఈ నేపధ్యంలో సినిమా సక్సెస్ సాధించడంపై అభిమానులు, ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ… చిత్ర యూనిట్ కు విషెస్ తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పెద్దన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ వేదికగా ‘భీమ్లా నాయక్’ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ… ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

చిరు ట్వీట్ ఏంటో చూద్దాం..:

“Heartiest Congratulations on the Thumping Success of #BheemlaNayak True Power Storm!” అంటూ ‘భీమ్లా నాయక్‌’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పట్ల మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న విడుదలై సంచలనం సృష్ఠిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ ను సొంతం చేసుకుంది. తెలంగాణలో ఆల్ టైమ్ రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా పవర్ స్టార్ తన పవరేంటో సినిమా వసూళ్ల ద్వారా నిరూపిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ‘భీమ్లా నాయక్’ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం ‘భీమ్లా నాయక్’ కు పెద్ద అసెట్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా పండుగ చేసుకుంటున్నారు. ఇక ‘భీమ్లా నాయక్’ ముందుముందు ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో అన్నది చూడాలి.

  Last Updated: 26 Feb 2022, 05:35 PM IST