Site icon HashtagU Telugu

Chiranjeevi: వరుణ్ సినిమాల్లో నాకు నచ్చిన మూవీ అదే.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్?

Mixcollage 26 Feb 2024 10 47 Am 634

Mixcollage 26 Feb 2024 10 47 Am 634

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. దీనితో ఈ మూవీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న రిలీజ్ కి రెడీ అవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మవిభూషణ్ అవార్డు అందిన తర్వాత చిరంజీవి హాజరువుతున్న తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కావడంతో అయన ఏవీ అద్భుతంగా డిజైన్ చేసారు.

ఏవి పూర్తి కాగానే ఆడిటోరియం మొత్తం చిరంజీవి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఇక చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. నేను యుఎస్ లో ఉండగా వరుణ్ నాకు మెసేజ్ పెట్టాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా తన చిత్రం గురించి చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరు వచ్చి నాలుగు మాటలు చెబితే రీచ్ బావుంటుందని అన్నాడు. మనకోసం కంటిమీద నిద్ర లేకుండా బోర్డర్ లో కష్టపడుతున్న జవాన్ల గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం. నేను తప్పకుండా వస్తా అని చెప్పాను. టైటిల్ లో వాలెంటైన్ అని ఉంది. రొమాన్స్ కూడా ఉందా అని అడిగా. లేదు ఆరోజున జరిగే ఆపరేషన్ కాబట్టి అలా టైటిల్ పెట్టినట్లు తెలిపాడు.

అనంతరం చిరంజీవి వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ కి మా కుటుంబంలో ఎవరికీ దక్కని అవకాశాలు దక్కుతున్నాయి. కంచె చిత్రంలో సైనికుడిగా, అంతరిక్షంలో వ్యోమగామిగా, తొలిప్రేమలో లవర్ బాయ్ గా ఇలా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వెళుతున్నాడు. వరుణ్ సినిమాల్లో గద్దలకొండ గణేష్ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం అని చిరంజీవి తన మనసులో మాట బయట పెట్టారు.

Exit mobile version