Chiranjeevi : ఇటీవల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాపై రిలీజ్ కి ముందు నుంచే చాలా మంది నెగిటివ్ ప్రచారం చేసారు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అయితే టార్గెట్ చేసి మరీ గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేసి, సినిమా కథ అంతా సోషల్ మీడియాలో చెప్పేసి, బాగా నెగిటివిటీ చేసి సినిమాకు తీరని నష్టం మిగిల్చారు.
దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నిన్న డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో ఇండైరెక్ట్ గా స్పందిస్తూ.. ఇటీవల రోజుల్లో ఒక సినిమా సక్సెస్ అయిందని చెప్పుకోవడం చాలా కష్టంగా ఉంది. సినిమాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్, నెగిటివిటీ చేస్తున్నారు. సోషల్ మీడియా చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది, భయమేస్తుంది, సిగ్గేస్తుంది ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు. సినిమా నచ్చకపోతే చెప్తే నేర్చుకుంటాము కానీ ఇలాంటి నెగిటివిటీ ఎందుకు. మీ వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. నిర్మాతలు సినిమాలు తీయాలంటేనే భయపడుతున్నారు. అందరి హీరోల ఫ్యాన్స్ కి బాధ్యత ఉంది. మీరు మీరు కొట్టుకోండి కానీ సినిమాలపై మాత్రం నెగిటివిటీ చేయకండి అంటూ ఎమోషనల్ అవుతూనే సీరియస్ అయ్యారు. దీంతో తమన్ వ్యాఖ్యలు చర్చగా మారాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తమన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్వీట్ చేసారు. చిరంజీవి తమన్ తన ట్వీట్ లో.. డియర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే. కానీ మాటలు ఇన్ స్పైర్ చేస్తాయి. మాటలు నాశనం చేస్తాయి. మీరు ఏం చేయాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది అంటూ రాసుకొచ్చారు.
Dear @MusicThaman
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.విషయం సినిమా అయినా క్రికెట్ అయినా
మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025
దీంతో గేమ్ ఛేంజర్ సినిమాపై వచ్చిన నెగిటివిటీ చిరంజీవి వరకు వెళ్లిందని, ఆయన కూడా ఈ విషయంలో బాధపడ్డారని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ వైరల్ అవ్వగా మరి దీనిపై ఎవరైనా సినిమా వాళ్ళు ఇంకా స్పందిస్తారా, సోషల్ మీడియాలో మళ్ళీ దీనిపై కూడా కొంతమంది రాద్ధాంతం చేస్తారా చూడాలి.