Site icon HashtagU Telugu

Megastar Chiranjeevi: రాజకీయాలపై చిరంజీవి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Chiranjeevi

Chiranjeevi

రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఏపీలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై తన మనసులో మాట మరోసారి బయటపెట్టారు. రాజకీయాల్లో సెన్సిటివ్ గా ఉండకూడదని, కటువుగా ఉండాలని, అక్కడ రాణించండం కష్టం అని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ అసాధ్యుడని, ఏమైనా అంటాడు అనిపించుకుంటాడని అన్నారు. అందరి అండతో పవన్ కళ్యాణ్ ను ఏదో ఒక రోజు అత్యున్నత స్థాయిలో చూస్తామని తెలిపారు. నర్సాపురంలోని వైఎన్ కాలేజీలో జరిగిన కాలేజీ మిత్రుల గెట్ టు గెదర్ లో చిరంజీవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజకీయాల్లో రాణించడం చాలా కష్టతరమైన పని అన్నారు. సెన్సిటివ్‌గా ఉండేవాళ్లు రాణించడం మరీ కష్టమైన పని అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉంటే మాటలు అనాలి.. అనిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. తన తమ్ముడు పవన్ రాజకీయాలకు తగినవాడని అభిప్రాయపడ్డారు. మాటలు పడ్డా.. తిరిగి అనగలిగే సామర్థ్యం ఉన్నవాడు అని వెల్లడించారు. ఏదో ఒకరోజు తప్పకుండా పవన్ కల్యాణ్‌ను అత్యున్నత స్థానంలో చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.