Site icon HashtagU Telugu

Megastar : మెగా మనసు చాటుకున్న చిరంజీవి…అభిమాని చివరి కోరిక ఇలా తీర్చాడు..!!

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి….తన అభిమానుల పట్ల ఎంతలా ఆపేక్ష చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తన సొంతూరు మొగల్తూరుకు చెందిన ఓ అభిమాని చివరికోరిక తీర్చారు చిరంజీవి. ఆ అభిమాని పేరు నాగరాజు…అతనికి రెండు కిడ్నీలు చెడిపోయాయి. తన చివరికోర్కెగా మెగాస్టార్ చిరంజీవిని కలవాలని మనసులో మాటను వెల్లడించాడు.

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి నాగరాజును తన ఇంటికి ఆహ్వానించాడు. మృత్యువుతో పోరాడుతున్న తన అభిమానిని చూసి చిరు చలించిపోయాడు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. దాదాపు గంటపాటు ఆయనతో ముట్టడించారు. అతడిలో మానసిక స్ధైర్యం కలిగించడమే కాకుండా…ఆర్థిక సాయం కూడా అందించారు చిరంజీవి.