Site icon HashtagU Telugu

Chiranjeevi : చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..

Megastar Chiranjeevi launches the second edition of Master of Suspense Hitchcock

Chiranjeevi

Chiranjeevi : ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలే ఇన్స్పిరేషన్. ఆల్ఫెడ్‌ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ – ఐఆర్‌టిఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం రాసారు. ఇటీవల డిసెంబర్ 18న ఈ పుస్తకం ఫస్ట్ కాపీ విడుదలైంది.

అయితే సినీ ప్రేమికులు హిచ్ కాక్ అభిమానులు ఈ పుస్తకాన్ని తెగ కొనేశారు. ఐదు రోజుల్లో పుస్తకాలు అన్నీ అమ్ముడు పోవడంతో సరికొత్త చేర్పులతో తాజాగా సెకండ్ ఎడిషన్ లాంచ్ చేశారు. ఈ సెకండ్ ఎడిషన్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ సెకండ్ ఎడిషన్ లాంచ్ చేసిన చిరంజీవి మాట్లాడుతూ… హిచ్ కాక్ సినిమాలు కొన్నిటిని నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చూశాను. ఈ పుస్తకాన్ని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పది పదిహేను రోజుల్లో చదివేస్తాను. ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో బుక్ రావడం అభినందనీయం. ఇలాంటి పుస్తకాలను పులగం చిన్నారాయణ, రవి పాడి మరిన్ని సంకల్పించాలి అని అన్నారు.

ప్రసిద్ధ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ పుస్తకానికి ముందుమాట రాయడంతో పాటు ఆయన కెరీర్ లో తొలిసారి‌‌ ఒక పుస్తకాన్ని ప్రశంసిస్తూ పాడ్ కాస్ట్ విడుదల చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’లో 45 మంది దర్శకులు, ఏడుగురు రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ (HLF)లో ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ ఈ పుస్తకాన్ని, రాసిన పులగం చిన్నారాయణ, రవి పాడిలను అభినందించారు.

Also Read : Odela 2 Teaser : తమన్నా ఓదెల 2 టీజర్ వచ్చేసింది.. మహా కుంభమేళాలో రిలీజ్..