Site icon HashtagU Telugu

Megastar Chiranjeevi in Pushpa 2 : పుష్ప 2 లో మెగాస్టార్ చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే అప్డేట్..!

Megastar Chiranjeevi In Allu Arjun Pushpa 2 Sukumar Mega Plan

Megastar Chiranjeevi In Allu Arjun Pushpa 2 Sukumar Mega Plan

Megastar Chiranjeevi in Pushpa 2 పుష్ప 1 తో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ సుకుమార్ కాంబో పుష్ప 2 తో మరోసారి భారీ రికార్డులను టార్గెట్ గా పెట్టుకున్నారు. పుష్ప 2 సినిమాను నెక్స్ట్ ఇయర్ ఆగష్టు రిలీజ్ లాక్ చేశారు. పుష్ప 1లో పుష్ప రాజ్ యాటిట్యూడ్ కి ఫ్యాన్స్ ఫిదా అవగా సినిమా రేంజ్ మరింత పెంచేలా సినిమాలో పుష్ప రాజ్ ఓ స్టార్ హీరో అభిమానిగా చూపిస్తున్నారట. పుష్ప 2 లో బన్నీ (Bunny) అదే పుష్ప రాజ్ మెగా అభిమానిగా కనిపిస్తాడని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా సినిమాలో పుష్ప రాజ్ సీన్ ఉంటుందట.

పుష్ప రాజ్ ఇంద్ర సినిమా చూసే టైం లోనే శ్రీవల్లి మీద ఎటాక్ జరుగుతుందట. సో పుష్ప 2 లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంద్ర సినిమా కనిపిస్తుంది. పుష్ప 2 లో ఇంద్రసేనా రెడ్డిగా చిరు డైలాగ్ వినిపించబోతుంది. ఎప్పటికప్పుడు చిరు మీద తన అభిమానాన్ని చూపిస్తున్న అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 తో మెగా అభిమానిగా మరోసారి తన ప్రేమని చూపిస్తున్నాడు.

పుష్ప 2 (Pushpa 2) ని సుకుమార్ మరింత ఫోకస్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా విషయంలో నిర్మాతలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. పుష్ప 1 కాదు పుష్ప 2 లోనే అసలు కథ ఉందని చెబుతున్న సుకుమార్ (Sukumar) ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. పుష్ప 2 సినిమా కోసం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా బీ టౌన్ ఆడియన్స్ అయితే పుష్ప 2 కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అక్కడ ఆడియన్స్ కి పుష్ప మాస్ యాటిట్యూడ్ బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప 1 హిందీ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

Also Read : Bhagavanth Kesari Business : భగవంత్ కేసరి టార్గెట్ ఫిక్స్.. బిజినెస్ డీటైల్స్ ఇవే..!