Site icon HashtagU Telugu

Chiru wishes To Nag: నాగ్ కు చిరు ‘బర్త్ డే’ విషెష్!

Nag And Chiru

Nag And Chiru

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయనకు మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రియమైన స్నేహితుడు నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నానని’ తెలుపుతూ చిరు ఈ అరుదైన చిత్రాన్ని తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. చిత్ర పరిశ్రమలో చిరు, నాగ్ ల మధ్య మంచి స్నేహం ఉంది. నాగ్ సినిమాలు విడుదలైనప్పుడల్లా చిరు వాటిని చూస్తూ ఉత్సాహ పరుస్తుంటాడు. నాగ్ కూడా చిరంజీవి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు.