Megastar Chiranjeevi : మెగాస్టార్.. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్..!

Megastar Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. బింబిసార తో సత్తా చాటిన డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. విశ్వంభర సినిమాను యువి క్రియేషన్స్

Published By: HashtagU Telugu Desk
Is Chiranjeevi Green signal for Prashanth Varma

Is Chiranjeevi Green signal for Prashanth Varma

Megastar Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. బింబిసార తో సత్తా చాటిన డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. విశ్వంభర సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమాకు దాదాపు 150 నుంచి 200 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా చిరు లుక్ రివీలైంది.

చిరు విశ్వంభర సెట్స్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెళ్లారు. జనసేన పార్టీకి చిరంజీవి ఐదు కోట్ల విరాళం అందించిన సందర్భంగా విశ్వంభర సెట్ లో పవన్ చిరంజీవిని కలిశారు. ఈ క్రమంలో విశ్వంభర సినిమాలో చిరు లుక్ లీక్ అయ్యింది. బయట ఎలా ఉన్నా సినిమాలో సంబందించిన గెటప్ లో మాత్రం చిరు సర్ ప్రైజ్ చేస్తాడు.

విశ్వంభర సినిమాలో చిరు లుక్ అదిరిపోయింది. ఈ సినిమా తన రెగ్యులర్ సినిమాలా కాకుండా డిఫరెంట్ కథతో సరికొత్త కథాంశంతో రాబోతుందని తెలుస్తుంది. విశ్వంభర సెట్స్ నుంచి బయటకు వచ్చిన ఫోటోస్ లో చిరు లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ అందుకున్న చిరు భోళా శంకర్ తో నిరాశపరచాడు. అందుకే విశ్వంభరతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. విశ్వంభర సెట్స్ లో చిరు లుక్ చూసి ఆయన ఏజ్ నిజంగా 68 ఏళ్లెనా అని షాక్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. చిరు విషయంలో ఏజ్ జస్ట్ ఏ నెంబర్ మాత్రమే అనుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. చిరంజీవి విశ్వంభర సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. జనవరి 10న సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

Also Read : World Oldest Human: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఈయ‌నేనా..?

  Last Updated: 10 Apr 2024, 11:51 AM IST