Site icon HashtagU Telugu

Chiranjeevi – Ka : ‘క’ చిత్ర యూనిట్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

Chiru Ka

Chiru Ka

‘క’ (Ka) చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), దర్శకులు సుజిత్-సందీప్ ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కిరణ్ ట్వీట్ చేశారు. ‘బాస్ నుంచి అభినందనలు. గంటకుపైగా గుర్తుండిపోయే సంభాషణకు అవకాశమిచ్చిన మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఓ ఆశీర్వాదంగా భావిస్తాను’ అని రాసుకొచ్చారు.

ఇక టాలీవుడ్ కు చిరంజీవి పెద్ద దిక్కు గా మారిన సంగతి తెలిసిందే. కేవలం ఆయన సినిమాల ప్రొమోషన్లే కాదు చిన్న చిత్రాలకు కూడా తన వంతు ప్రమోషన్ చేస్తూ వాటి కలెక్షన్లు పెరిగేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయితే చాలు వెంటనే ఆ చిత్ర యూనిట్ ను ఇంటికి పిలిపించుకొని వారిని అభినందిస్తున్నారు. రీసెంట్ గా లక్కీ భాస్కర్ డైరెక్షర్ వెంకీ ని అభినందించిన చిరు..ఇప్పుడు క (KAA) యూనిట్ ను అభినందించి..సినిమాను చాల అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు.

రాజా వారు రాణి గారు (Raja varu Rani Garu) సినిమాతో హీరోగా తొలి సినిమాతోనే అలరించిన కిరణ్.. ఎస్.ఆర్ కళ్యాణమండపం తో తన మార్క్ చూపించాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈమధ్యలో చేసిన సినిమాల్లో వినరో భాగ్యము విష్ణు కథ తప్ప మరో సినిమా ఆడలేదు. అయినా సరే మనోడు వెనక్కి తగ్గలేదు. తాజాగా ‘క’ (Ka) అంటూ క్రేజీ సినిమాతో దీవాలి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను సుజిత్, సందీప్ అనే దర్శక ద్వయం డైరెక్ట్ చేసారు. ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్, టీజర్ , ట్రయిలర్ ఇలా ప్రతిదీ సినిమా పై ఆసక్తి పెంచడం తో సినిమా ఎలా ఉండబోతుందో అనే అంచనాలు పెరిగాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే సినిమా తెరకెక్కడం తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తోంది.

ఓ ఊరిలో అమ్మాయిలు మిస్సవడానికి కారణమెవరు? ఈ కేసులకు హీరోకు సంబంధమేంటి అనే క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ‘క’ తెరకెక్కింది. డైరెక్టర్లు సుజీత్-సందీప్ కథను నడిపిన తీరు, ఇంటర్వెల్, కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టిన క్లైమాక్స్, BGM, కిరణ్ నటన ఇలా ప్రతిదీ ఆకట్టుకున్నాయని అంటున్నారు. చివరి 15 నిమిషాల్లో మలుపులు థ్రిల్ చేస్తాయి.

Read Also : Parenting Tips : పిల్లలకు 13 ఏళ్లు రాకముందే ఈ జీవిత పాఠాన్ని నేర్పించాలి