Site icon HashtagU Telugu

Chiranjeevi: టాలీవుడ్ శిఖరంతో ఎవరెస్ట్ శిఖరాలు

Chiranjeevi

Chiranjeevi

టాలీవుడ్ శిఖరం చిరంజీవిని ఎత్తైన శిఖరాలు అధిరోస్తున్న ఇద్దరు పర్వోతరోహకురాలు కలుసుకున్నారు. పేద బాలికలకు ఉన్నత విద్యనందించే లక్ష్యంతో హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన నాసా శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మన్యపు, మరో పర్వతారోహకురాలు మలావత్ పూర్ణను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.

శనివారం వారు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బాలికకు ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందని తెలిపారు. మలావత్ పూర్ణ ఇప్పటికే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన విషయం తెలిసిందే.