విజయానికి మరో రూపం..స్వశక్తికి ప్రతిబింబం..గర్వం లేని సగర్వ ప్రయాణం..సాయానికి ముంగిపు లేని అధ్యాయం..ప్రజాభిమానంలో మేలు పర్వతం..నటనలో నటరాజు మెచ్చే విలక్షణత్వం..కళామతల్లి సైతం పొందే తనమత్వం..వేఱొవారికి సాధ్యంకాని మెగా ప్రస్థానం ..మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి(Megastar Chiranjeevi ) సొంతం. పదాలు సైతం పరవిశించే పేరు మెగాస్టార్. బిరుదులూ సైతం గర్వపడే స్టార్ మెగాస్టార్. పునాదిరాళ్లతో వేసిన పునాది..నేటికీ చెక్కు చెదరలేదంటే అది ఆ నటుడు గొప్పతనం. వెనుక ఎవరు లేరని అనుకోలేదు ఏనాడూ. పోటీలో తగ్గలేదు ఏరోజు. ప్రేక్షక అభిమానుల అభిలాషను తన స్వయంకృషితో గెలిచిన మగమహారాజు మన మెగాస్టార్.
నటనలో వైవిద్యం..డాన్సులో విలక్షణత్వం..వృత్తి పట్ల ప్రేమాభిమానం. ఇలా ప్రతిక్షణం శ్రమించాడు కాబట్టే అభిమానుల గుండెల్లో ఖైదీ అయ్యాడు. ఇండస్ట్రీ అందరికి మనవాడు..అందరి వాడయ్యాడు.తూఫాన్ లను ఎదురుకొని రికార్డుల మోతమోగించాలన్న..థియేటర్స్ ఊగేలా రచ్చ చేయాలన్న…పదునైన డైలాగ్ లతో రఫ్ ఆడించాలన్న.. మాస్ కు కేరాఫ్ అడ్రెస్స్..క్లాస్ తో కూడా క్లాప్స్ కొట్టించే సక్సెస్..దేశంలోనే అప్పట్లో సృష్టించాడు సన్షేషనల్..హీరోల కెరియర్ కు అయన కెరియర్ ఓ గ్యాడ్ లైన్..అప్పటికి..ఇప్పటికి..ఇప్పటికి తరగదు ఆయన గ్రేట్ నెస్..ఇలా ఎంత చెప్పిన సరిపోదు మన మెగాస్టార్ జర్నీ.
చిరంజీవి సినీ ప్రస్థానం మరో మైలురాయి చేరుకుంది. నిన్నటి తో (సెప్టెంబర్ 22) చిరంజీవి నట ప్రస్థానానికి 45 సంవత్సరాలు (Chiranjeevi 45 years in The Industry) నిండాయి. ఆయన నటించిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ (Pranam Khareedu) 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నిన్నటితో (2023 సెప్టెంబర్ 22) 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, రికార్డులు. ఎన్నో విభిన్నమైన పాత్రలను అందుకున్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేస్తూ కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు 155 చిత్రాలు చేసిన ఆయన 70 పదుల వయసుకు దగ్గర పడుతున్నా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలు చేశారు. ఇక చిరంజీవి 45 ఏళ్ల సినీ ప్రస్థానం ఫై యావత్ అభిమానులు , సినీ ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు.
Read Also : Tirumala : బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు
‘సినీ పరిశ్రమలో 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్న మన ప్రియమైన మెగాస్టార్ (Megastar)కి హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రయాణం ఎంతో గొప్పది. ప్రాణం ఖరీదుతో ప్రారంభమైన ఈ జర్నీలో ఆయన మనల్ని ఇప్పటికీ అబ్బురపరుస్తూనే ఉన్నారు. వెండితెరపై అద్భుతమైన నటనతో, బయట మానవత్వంతో కూడిన మీ కార్యకలాపాలను కొనసాగిస్తూ కొన్ని కోట్ల మందిని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కష్టించే తత్వం, అంకిత భావం వంటి విలువలతో పాటు వాటన్నింటినీ మించి మాలో కరుణను పెంపొందించిన నాన్న మెగాస్టార్ చిరంజీవిగారికి ధన్యవాదాలు’’ అని రామ్ చరణ్ తెలిపారు.
అలాగే మా hashtag u టీం తరుపున కూడా చిరంజీవి గారికి విషెష్ అందిస్తూ..మరెన్నో విజయాలు సాధించి..ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాం.