Chiranjeevi : తమ్ముడి బర్త్డే దగ్గరుండి మరి జరిపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోస్ వైరల్?

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 12:00 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు నటీనటులు కూడా చిరంజీవికి అభిమానులే. చిరంజీవిని ఇన్స్పైర్ గా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూడా ఒకరు.

శ్రీకాంత్ చిరంజీవి అన్నయ్య అని పిలుస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలిసి కొన్ని సినిమాలలో నటించారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి శంకర్ దాదా mbbs, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో కలిసి నటించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ వేసిన ATM పాత్ర బాగా హిట్ అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా నేడు శ్రీకాంత్ పుట్టిన రోజు కావడంతో చిరంజీవి స్వయంగా శ్రీకాంత్ ఇంటికి కేక్ తీసుకొని వెళ్లి కేక్ కట్ చేయించి తినిపించారు. అనంతరం శ్రీకాంత్ ఫ్యామిలీతో సరదాగా కాసేపు గడిపారు. శ్రీకాంత్ ఫ్యామిలీతో ఫోటోలు దిగారు. కేక్ మీద హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్ లవ్ ఫ్రమ్ అన్నయ్య అని రాయించడం విశేషం.

శ్రీకాంత్ బర్త్ డేని చిరంజీవి స్వయంగా వెళ్లి సెలబ్రేట్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయంలో చిరంజీవిని అంతా అభినందిస్తుండగా శ్రీకాంత్, చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం మరోసారి వైరల్ అవుతుంది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మరి బర్త్డే సెలబ్రేట్ చేయడం మామూలు విషయం కాదు వీరి మధ్య అంత మంచి బాండింగ్ ఉందా అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.