Site icon HashtagU Telugu

‘WAVES’ సమ్మిట్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి

Waves 2025 Chiranjeevi

Waves 2025 Chiranjeevi

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES 2025) ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మరియు మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలోని ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై చర్చలు, ప్రదర్శనలు జరుగనున్నాయి.

Pakistan Vs India : పాక్ చెరలోనే బీఎస్‌ఎఫ్‌ జవాన్‌.. చర్చలపై కొత్త అప్‌డేట్

ఈ సమ్మిట్‌లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌, మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. వీరికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమ్మిట్‌లో సినీ సాంకేతికత, డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్, ఫిల్మ్ మేకింగ్, OTT, మ్యూజిక్, యానిమేషన్ వంటి రంగాలలో అభివృద్ధి చెందుతున్న కొత్త ఆవిష్కరణలపై ప్రముఖులు అభిప్రాయాలు పంచుకోనున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ వినోద పరిశ్రమ స్థానం, అవకాశాలు, సవాళ్లు వంటి అంశాలపై ప్రముఖ స్టూడియోలు, ప్రొడ్యూసర్లు, టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌లు తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు.

ఈ సమ్మిట్‌ ప్రధాన ఉద్దేశ్యం భారతీయ వినోద రంగాన్ని గ్లోబల్‌ స్టాండర్డ్స్‌కు చేర్చడం, అంతర్జాతీయ సహకారాలను మెరుగుపరచడం, టెక్నాలజీని వినియోగించుకొని కంటెంట్‌ను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లడమే. ఈ సందర్భంగా వివిధ దేశాల చిత్ర నిర్మాణ సంస్థలు, స్ట్రీమింగ్ సంస్థలు భారతీయ సంస్థలతో భాగస్వామ్యాలపై చర్చించనున్నాయి. గేమింగ్, VFX, AR/VR వంటి రంగాల్లోనూ ప్రదర్శనలు, సదస్సులు ఉండబోతున్నాయి. WAVES 2025 సమ్మిట్ భారతీయ వినోద రంగానికి ఒక గ్లోబల్ ప్లాట్‌ఫాం అందించబోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.