Site icon HashtagU Telugu

Megastar Chiranjeevi: కేంద్ర హోమ్ శాఖ ఏర్పాటు చేసిన విందుకి కుటుంబసభ్యులతో హాజరైన మెగాస్టార్

Megastar Chiranjeevi

Safeimagekit Resized Img (1) 11zon

Megastar Chiranjeevi: పద్మ అవార్డులను గురువారం (మే 9) న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చిరంజీవి, వైజయంతి మాలకు సినీ రంగానికి చేసిన విశేష కృషికి గానూ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను ప్రదానం చేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా విజేతలను ప్రకటించారు. సినీ ప్రపంచం నుంచి చిరంజీవి, వైజయంతిమాల, ప్రముఖ డ్యాన్సర్ పద్మా సుబ్రమణ్యం పద్మవిభూషణ్‌కు ఎంపికయ్యారు. 68 ఏళ్ల చిరంజీవి (Megastar Chiranjeevi) 150కి పైగా సినిమాల్లో పనిచేశారు. ఆయన 2008లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారాజ్యం పార్టీ అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. చిరంజీవి 2006లో పద్మభూషణ్ అందుకున్నారు.

అయితే ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లారు. అయితే ఈ ప్రతిష్టాత్మ‌క అవార్డు త‌ర్వాత మెగాస్టార్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే చిరంజీవి.. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలకు కేంద్ర హోం శాఖ మంత్రి ఏర్పాటు చేసిన విందుకి కుటుంబసభ్యులతో హాజ‌రై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఈ ప్ర‌త్యేక విందులో హాజ‌రైన వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న స‌తీమ‌ణి సురేఖ‌, కుమార్తె సుస్మిత‌, కొడుకు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, కోడ‌లు ఉపాస‌న కొణిదెల ఉన్నారు.

Also Read: BRS party: మన్నె క్రిషాంక్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది : బీఆర్ఎస్ పార్టీ

అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు అందుకోవ‌డంతో అటు టాలీవుడ్ ప్ర‌ముఖ‌ల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు. వారిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు మెగాస్టార్‌కు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌ల‌ను ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తెలిపారు. చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విధంగా రాసుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (@KChiruTweets) గారికి శుభాకాంక్షలు. లక్ష్యాల పట్ల గట్టి సంకల్పంతో, క్రమశిక్షణతో కృషి చేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన చిరంజీవి గారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

We’re now on WhatsApp : Click to Join