Site icon HashtagU Telugu

Chiranjeevi: నెట్టింట వైరల్ అవుతున్న మెగాస్టార్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్?

Mixcollage 18 Mar 2024 02 16 Pm 6454

Mixcollage 18 Mar 2024 02 16 Pm 6454

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ కూడా మొదలయ్యాయి. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్‌ వశిష్ఠ.

బింబిసార చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టిన ఆయన ఈ చిత్రంతో మరో భారీ హిట్‌ కొట్టేందుకు చూస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరు ఇటీవల ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు కూడా అందుకున్నారు. 70 ఏళ్లకు ద‌గ్గర ప‌డుతున్నా, ఇప్పటికీ కుర్ర హీరోల‌తో పోటీప‌డి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ 10వ త‌ర‌గ‌తి స‌ర్టిఫికేట్ తాలూకు ఫొటో ఒకటి నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ స‌ర్టిఫికేట్‌లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వ‌ర‌ప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంక‌ట్ రావు అని ఉంది. చిరు పెనుగొండ‌లో పుట్టిన‌ట్లు ఇందులో పేర్కొన‌డం జ‌రిగింది. ఇప్పుడీ స‌ర్టిఫికేట్ సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మార‌డంతో మెగాస్టార్ అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

మెగాస్టార్‌ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వ‌శిష్ఠ ద‌ర్శక‌త్వంలో విశ్వంభ‌ర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న‌ సీనియ‌ర్ న‌టి త్రిషా హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేస్తామ‌ని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రక‌టించింది.

Exit mobile version